భాజపా జిల్లా కార్యదర్శిగా చేవెళ్ల మండలంలోని ఇక్కరెడ్డిగూడ గ్రామానికి చెందిన గుండన్నగారి వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శులు అనంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి, కృష్ణ గౌడ్, బీజేవైఎం నియోజకవర్గ అధ్యక్షుడు అల్లాడ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.