స్టూడియో 10 టీవీ న్యూస్ మార్చి 23
గిద్దలూరు టిడిపి ఇంచార్జ్ ముత్తుముల సమక్షంలో వైస్ సర్పంచ్ తో సహా వైసిపిని వీడి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రాత్రి టిడిపి ఇన్చార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సమక్షంలో కొమరోలు మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తాటిచర్ల పంచాయతీకి చెందిన వైసిపి వైస్ సర్పంచ్ తో సహా గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి గారు వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గారి గెలుపుకోసం పని చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ వీడి టీడీపీలో చేరిన వైస్ సర్పంచ్ పందిళ్ళ నాగేశ్వర రావు, శ్రీరాములు, రమణ, పుల్లయ్య, శివబాబు, జి. తిరుపతి, పందిళ్ళ వెంకటేశ్వర్లు, అశోక్, రమేష్, రంగస్వామి, వెంకటస్వామి, పుల్లయ్య, రాఘవేంద్ర, పెద్ద పుల్లయ్య, పిచ్చయ్య, హరి, వెంకటయ్య, చిన్న నాగయ్య, చిన్న బాలయ్య, చంద్రయ్య, పెద్ద బాలయ్య, వెంకటేశ్వర్లు, చిన్న పుల్లయ్య, కిరణ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, నాగేంద్ర, బాల ఈశ్వరయ్య, కాశీ ఈశ్వరయ్య, పెద్దన్న, వెంకటేశ్వర్లు, నారాయణ, నాగ వంశీ, బాషా, (వెంకటేశ్వర్లు) వెంకట రమణ మరియు మండల టీడీపీ నాయకులు బిజ్జం వెంకట రామిరెడ్డి రెడ్డి, రవీంద్రా రెడ్డి, అనప వీర శేఖర్ తదితరులు పాల్గోన్నారు.