ప్రకాశం జిల్లా గిద్దలూరు టిబి యూనిట్ పరిధిలోని క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహర నిమిత్తం జిల్లా క్షయ నివారణ కార్యాలయం నుండి జిల్లా క్షయ నివారణఅధికారి డాక్టర్ డి. సురేష్ కుమార్ గిద్దలూరు టీబీ యూనిట్ పరిధిలో గల సంజీవ్ రావు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్. సుమయ చేతుల మీదుగా టిబి వ్యాధిగ్రస్తులకు ఫుడ్ బాస్కెట్ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజక వర్గ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ నాయబ్ రసూల్ పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్.సుమయ మాట్లాడుతూ..రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం,
చాతిలో నొప్పి రావడం, కళ్ళతో కూడిన రక్తం పడటం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కళ్ల పరీక్ష చేయించుకోవాలన్నారు. ఎవరైతే టీబివ్యాధి బారిన పడతారో వాళ్లకు ఆరు నెలల పాటు ఉచితంగా మందులతో పాటు నెలకి 500 రూపాయలు పారితోషకం
ఇవ్వబడుతుందన్నారు. వ్యాధిగ్రస్తులైనవారు మందులు వాడేక్రమంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి కళ్లపరీక్షలు చేయించుకొని, వారి యొక్క జబ్బు తీవ్రతను గమనించుకోవాల్సిందిగా కోరారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల 2025నాటికల్లా టీబిని పూర్తిగా నిర్మూలన చేయవచ్చని తెలిపారు.. ఆరు నెలల పాటు టీబీ మందులు వాడినట్లయితే పూర్తిగా వ్యాధి నుంచి విముక్తి చెందుతారని తెలియజేశారు. కార్యక్రమంలో రవీంద్ర రెడ్డి, ఎం.పీ.హెచ్.ఎస్ మల్లికార్జున్ రెడ్డి, ఎం. పి .హెచ్ .ఎస్ (ఫిమేల్) నాగవేణి, హెల్త్ అసిస్టెంట్ లు , ఏఎన్ఎంలు , ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు