బాధిత కుటుంబానికి రూ. 50వేలు ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ లావణ్య శంకర్
చేవెళ్ళ : ఈదురు గాలుల వర్షానికి రామన్నగూడ గ్రామంలో దుంస లలిత ఇల్లు కూలింది. 10 నెలల క్రితమే కొత్తగా ఇల్లు నిర్మించుకొని ఇద్దరు (దుంస మహేందర్ , దుంస చంద్ర శేఖర్ ) కొడుకులతో కలిసి నివసిస్తునారు . రాత్రి భారీ వర్షంతో బలమైన ఈదురు గాలులు వీయడంతో ఇంటి పై కప్పు రేకులు లేచి పడ్డాయి. దీంతో భయాందోళనకు గురై ఇంటి నుండి బయటకు వచ్చారు. అదృష్టవశత్తు ఎవరికి ఏలాంటి ప్రాణాపాయం జరగలేదు. విషయం తెలుసుకున్న రామన్నగూడ సర్పంచ్ లావణ్య శంకర్ బాధిత కుటుంబాన్ని పరమర్శించి అనంతరం బాధిత కుటుంబానికి రూ. 50వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నడిమొల్ల శంకరయ్య , మల్లేశం , దామరగిద్ద జైపాల్ , శేఖర్ , శ్రవణ్ , మల్లేశ్ , కృష్ణయ్య , విట్టలయ్య , నర్సింహులు, మహేందర్ , గ్రామస్తులు , తదితరలు ఉన్నారు .