*సచివాలయం ఉద్యోగులతో సమీక్ష సమావేశం.*
_మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో కే.జాన్ లింకన్ ఆధ్వర్యంలో సచివాలయం ఉద్యోగులకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తాసిల్దార్ ఐపి.శెట్టి,ఎంఎస్ఓ టి.సుబ్బరాజు,మండల వ్యవసాయ అధికారిని సోమిరెడ్డి లక్ష్మీ లావణ్య పాల్గొని సొసైటీ సీఈవోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లతో మాట్లాడుతూ ఇప్పుడు వచ్చే రబీ సీజన్ లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం క్రయ, విక్రయాలు కొనుగోలు కేంద్రాల ద్వారా సజావుగా జరిగేటట్లు రైతు భరోసా కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లుచేసి తగు జాగ్రత్తలు వహించాలని మండలంలో 9,525 ఎకరాలలో రైతులు వరి సాగు చేశారని దీని ద్వారా 36 వేల క్వింటాళ్లు ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అందించే మద్దతు ధరలు పట్టికలను ఆర్బీకేలలో త్వరలోనే ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు.అనంతరం ఎంపీడీవో కే.జాన్ లింకన్ మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలపై ఆరా తీసి ముఖ్యముగా సీజనల్ జ్వరాల వ్యాధులుపై చర్చించి సచివాలయం ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వాలంటీర్ల సహకారంతో ఫీవర్ సర్వే ద్వారా రోగులను గుర్తించాలని,అలాగే ఆయుష్మాన్ భారత్ వంటి సర్వేలను పూర్తి చేయాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ రాజ్ కుమార్,సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు._