వికారాబాద్: జిల్లాలో గురవారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వాన, గాలి బీభత్సంతో చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో పంటలు దెబ్బతిన ప్రాంతాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో అకాలవర్షం, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి వికారాబాద్ జిల్లా పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు బయలుదేరారు. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో వడగళ్ల వానకు..దెబ్బతిన్న పంటలను నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించనున్నారు.