వికారాబాద్: మహావీర్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యానికి బలైన బాబు మృతి పట్ల విచారణ జరిపించి హాస్పటల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా డీఎంహెచ్వో పల్వాన్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. మహేందర్ మాట్లాడుతూ మహావీర్ హాస్పిటల్ లో నకిలీ డాక్టర్స్ తో కొనసాగుతున్న వైద్యం మాఫియా పై డీఎంహెచ్వో స్పందించి విచారణ జరిపించాలి అన్నారు. పిజి వైద్య విద్యార్థులచే వైద్యం చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల 9వ తారీఖున జన్మించిన బాబు మూడు రోజులు ఆరోగ్యంగా ఉండి సడన్గా మృతి చెందడం లో వైద్యుల నిర్లక్ష్యం ఉంది. పుట్టినప్పటి నుండి బాబు మొహం కూడా చూడని డాక్టర్ కేస్ షీట్ ఎలా రాస్తారు హాస్పటల్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతుంది మెడికల్ విద్యార్థులే ఇక్కడ డాక్టర్స్ గా చలామణి అవుతున్నారు హాస్పటల్ హెచ్ ఓ డి చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందిన బాబు తల్లిదండ్రుల పట్ల కనీస మానవత్వం లేకుండా మీరేమైనా వీఐపీల స్పెషల్ గా మీకు డాక్టర్స్ ని పెట్టించాలా అని దురుసుగా ప్రవర్తించడం వైద్య వృత్తికే కలంకషం కలిగించేలా ప్రవర్తించారు హాస్పిటల్లో కొనసాగుతున్న నకిలీ వైద్యంపై అదేవిధంగా మెడికల్ కళాశాలలో కొనసాగుతున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వై గీత, రాములు, శ్రీనివాస్, మల్లేష్ ,లాలయ్య పాల్గొనడం జరిగింది