*31వ వార్డు లో ఆరోగ్య మేళా కార్యక్రమం కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు*
*అజాది కా అమృత్ మహోత్సవ్* కార్యక్రమం లో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ మరియు రాష్ట్ర వైద్య శాఖ కలిసి నిర్వహిస్తున్న *ఆరోగ్య మేళా* కార్యక్రమం ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు లో కౌన్సిలర్ *మాలె గాయత్రి లక్ష్మణ్* ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది….
కార్యక్రమం అనంతరం వికారాబాద్ కేంద్రంలోని శ్రీ *బాలాజీ హాస్పిటల్ డాక్టర్ సందీప్* వేయింగ్ మిషన్,బిపి మిషన్,మరియు షుగర్ టెస్ట్ కిట్ వార్డు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు అందజేయడం జరిగింది….
ఈ సందర్భంగా కౌన్సిలర్ *మాలె గాయత్రి లక్ష్మణ్* మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మెడిసిన్ వాడే ముందు ఒకసారి డాక్టర్ ను సంప్రదించవలసిందిగా కోరారు….
ఈ కార్యక్రమంలో రామయ్య గూడా PHC ఇంచార్జ్ నిఖిల, CHO మురళి, ANM సంతోష, సుకన్య, ఆశ వర్కర్ జయలక్ష్మి వార్డు ప్రజలు పాల్గొన్నారు….