ఇంటి పట్టాలు మంజూరు చేయాలి- సిపిఐ
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 08, మహానంది:
మహానంది మండలం అబ్బిపురం గ్రామంలోని గిరిజన కాలనీలో నివసించే ఐదు కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని గత ఆరు నెలలుగా తహసిల్దార్ జనార్దన్ శెట్టికి వినతి పత్రాలు అందజేసిన స్పందించడం లేదని సిపిఐ మండల కార్యదర్శి వీరప్ప,జిల్లా సమితి సభ్యులు సామేలు బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు కనీసం ఇప్పటికైనా తహసిల్దార్ స్పందించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తహసిల్దార్ స్పందించని పక్షంలో నంద్యాల జిల్లా కలెక్టర్,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్టీ చైర్మన్ అండ్ కమిషన్ వారిని కలిసి వినతి పత్రాలు అందజేస్తామని సిపిఐ పార్టీ నాయకులు తెలియజేశారు.