ఆచార్యుని మమతా అనురాగాల పై పలు విమర్శలు
స్టూడియో 10 టీవీ న్యూస్,మార్చి 06, మహానంది:
మహానంది క్షేత్రంలో ఆచార్యుని మమత అనురాగాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నంద్యాలకు చెందిన నిత్య కూరగాయల దాత లక్క బోయిన ప్రసాద్ దంపతులకు జరిగిన చేదు అనుభవం పై 16 రోజులు పూర్తయిన నేటికీ చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. ఏదైనా చిన్న తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకునే ఆచార్యులు కొన్ని ఒత్తిడులతో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన వాటికి సంబంధించి నేటికి కూడా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో పనిచేసే చిరు ఉద్యోగుల నుంచి పై స్థాయి వరకు సెలవులు ఉండవని ఒక మెమో జారీ చేశారు. కానీ దీనిని ఉల్లంఘిస్తూ ఒక పరిచారకుడు విధులకు దూరంగా ఉన్నారు. కొన్ని రోజులపాటు విధులకు దూరంగా ఉంచి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ప్రధాన ఆలయంలో మరల విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చిన ఇతరులపై తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తీసుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు మాజీ , తాజా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఆలయ అధికారుల ముందే కొందరు సెలవులో ఉన్న వ్యక్తులు వారి ముందే అధికార దర్పం ప్రదర్శిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండడం పై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వారికే బ్రహ్మోత్సవాల అనంతరం ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే విధంగా ఆర్డర్ పాస్ చేయడం విశేషం. ఆలయంలో పనిచేసే ఏ ఉద్యోగకైనా సెలవులు ఇవ్వబడవు అంటూ మెమొరీ జారీ చేశారు కానీ ఇవి తమకు వర్తించమంటూ హుందాగా తమ కళ్ళ ఎదుట తిరుగుతున్నా మంగళ హారతులు పట్టారు . సస్పెండ్ అయిన ఒక అర్చకున్ని ఏడు నెలలు కావస్తున్నా ఒకే చోట విధులు నిర్వహించేలా ఉండటం ఏమిటి అనేది ఆచార్యుని లెక్కల్లో. మతలబు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.. ఒక అర్చకునికి కొన్ని కారణాలతో విధులు నిర్వహించాల్సినా స్థానంలో కాకుండా మరోచోట నిర్వహించేలా ఆర్డర్ పాస్ చేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిచారకులు కంటే తాము తక్కువ అనే విధంగా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారని ఇలాంటి వివక్షత ఎక్కడ లేనట్టు సమాచారం మరి దీనిపై ఆచార్యులు అధికార దర్పణానికి ప్రాధాన్యత ఇస్తారా లేక నిక్కచ్చిగా పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఆచార్యుని లెక్కల్లో అధికార దర్పణం ఒత్తిడీలు కారణంగా లెక్కల్లో తప్పిదాలు మార్పులు వస్తున్నట్లు తెలుస్తుంది.