మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- ఎస్సై నాగార్జున రెడ్డి

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు- ఎస్సై నాగార్జున రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 06, మహానంది:

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి హెచ్చరించారు.సోమవారం మహానంది మండల పరిధిలోని గాజులపల్లె మెట్ట నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిపై మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరి పై కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం మత్తులో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే తమ కుటుంబసభ్యుల పరిస్థితి ఏమిటనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మహానంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!