సమాజ గమనంలో మహిళల పాత్ర అమోఘం
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 05, మహానంది:
సమాజ గమనంలో మహిళల పాత్ర అమోఘమని విశ్రాంత ఉపాధ్యాయిని సమాజ సేవకురాలు వసుమతి పేర్కొన్నారు.మండల పరిధిలోని మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ కాలనీలో స్థానిక అంగన్వాడీ కార్యకర్త ఫాతిమా మేరీ రాణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఆదివారం గిరిజన మహిళలతో పాటు బడుగు బలహీనవర్గాల కు చెందిన గర్భవతులకు సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు మహిళ ముందడుగు వేస్తుందని, ఇందుకు వారి వారి కుటుంబాల పురుషులు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని అభినందించారు.మహిళ తనకున్న హక్కులను పొందుతూ ఇంట బయట అంతరిక్షంలోనూ తన పయనాన్ని సునాయాసంగా సాగిస్తూ ఔరా అనిపించుకుంటుందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాధ్యతలు నిర్వహణలో మంత్రిగా కలెక్టర్గా ఉద్యోగిగా, వ్యవసాయ కూలీగా, ఇంటిల్లిపాదికి క్షేమాన్ని కూర్చే దేవతగా ,ఆరాధింపబడుతుందని పేర్కొన్నారు .ఈ ఈ క్రమంలోనే గర్భవతులకు హైందవ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం సీమంతం చేశారు .అనంతరం వారికి ఆటపాటలతో ఆనందం కలిగించారు .అంతేకాక ఆసుపత్రుల్లో సుఖప్రసవాలు జరుపుకోవాలని ,మరిన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పారు.అంతేకాక నిత్యజీవనంలో ధ్యానాన్ని ఒక భాగంగా చేర్చుకొని అవలంబించాలని, అందువల్ల శారీరక మానసిక ఆరోగ్య సంపద సమకూరుతుందని, అనుభవయికంగా చేసి చూపించారు .ఈ సందర్భంగా కేకును కోసి పసుపు కుంకుమల గంధము పూసి గర్భవతుల్లో అవధులు లేని ఆనందాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చలంచలం శిరీష, నంద్యాల నుంచి వచ్చిన మహిళా సంఘం ప్రతినిధులు కుసుమకుమారి, భాగ్యలక్ష్మి, శాంతి ,సురేఖ వెంకటలక్ష్మి, రాజేశ్వరి, బిబి తదితరులు పాల్గొన్నారు.