మహానంది క్షేత్రంలో వైభవంగా పదహారు రోజుల పండుగ
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 05, మహానంది:
ప్రముఖ శైవక్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం రోజున నూతన కల్యాణ వధువరులైన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్ల పదహారు రోజుల పండుగ వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు.ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ఏఈఓ ఎర్రమల మధు, వేదపండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మూల వరులైన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లకు విశేష అభిషేకార్చనలు నిర్వహించారు. శాంతి కల్యాణం అనంతరం అంకురార్పనలకు షోడోపచారములు నిర్వహించి ఉధ్వాసన నిర్వహించారు. విశేష నివేదనం నిర్వహించి అంకురాలను ప్రదర్శనగా తీసుకువచ్చి రుద్రగుండం పుష్కరిణిలలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రథశాల వద్దకు చేరుకొని రథానికి పూజలు నిర్వహించి రథాంగ దేవతలకు ఉద్వాసన పలికారు. దీంతో వధువరుల దీక్ష విరమణ జరిగినట్లు వేదపండితులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా వేదపండితులు మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో నిర్వహించిన అంకురాలలలో మొలకలు ఏపుగా పెరిగాయని, ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురిసి పంటలు పుష్కలంగా పండుతాయని వారు తెలిపారు.