అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వెయ్యండి
– సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టి
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 04, వెలుగోడు:
వెలుగోడు పట్టణంలో వున్న పంట పొలాలను అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగోడులో వున్న పంట పొలాలను అక్రమంగా వెంచర్ వేసిన వారికి అధికారులు వంత పాడుతున్నారని ఆయన ఆరోపించారు. వెంచర్ల కోసం పక్కన ఉన్న బానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ 0.నుంచి వి బి ఆర్ మెయిన్ కెనాల్ వెంబడి వున్న మట్టి బండ బిల్క్ ను తీసుకొని వచ్చి వాగులు వంకలు నుంచి మట్టిని రెండు నెలలు నుండి విచ్చలవిడిగా తెస్తున్న స్థానిక మండల రెవెన్యూ మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం తో లేఅవుట్ల్ అప్రూవల్ కాని లేఅవుట్ లలో గృహ నిర్మాణాలు జరుగుతున్న మేజర్ పంచాయితీ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. వారి ముడుపులు ఎమైనా వారికి పుష్టిగా అందుతున్నాయాని వారు ఆరోపించారు. కార్యాలయాల్లో ఎసి ఫ్యాన్ల కింద మొక్కుబడి కార్యక్రమంగా కుర్చుని పనులు చేస్తున్నారని వారన్నారు ప్రజా సమస్యలు ఏకోశానా పట్టించుకునే పాపాన లేదన్నారు. కనీసం ఇక్కడ మైనింగ్ అధికారులు పని చేస్తున్నారా లేదా కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో మైనింగ్ అధికారులు ఎక్కడ వున్నారో తెలియాలన్నారు. దళారులు రాజకీయ నాయకులు వాగులు వంకల నుండి అక్రమంగా మట్టిని క్యూబీట్ మీటర్ల మాదిరినా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి దళారులు గండికొడుతున్న ఈ అధికారులకు చీమ కుట్టినట్లుగా లేదన్నారు ఈ జిల్లాలో ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఏమి చేయలేని పరిస్థితి లో వున్నారన్నారు ప్రస్తుత ప్రభుత్వంపై పలు విమర్శలు అధికారులను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కావున ఇప్పటికైనా సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణ దారులపై ప్రభుత్వానికి రావాల్సిన వాటా సొమ్ము ను రాబట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.