కంటి వెలుగు దేశానికి ఆదర్శప్రాయం జిల్లా ప్రజలు,పోలీస్ సిబ్బంది కంటి వెలుగు సద్వినియోగ పరుచుకోవాలి – కే.సురేష్ కుమార్ ఎస్పీ

స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ మార్చ్ 4

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం శనివారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శిబిరం హెడ్ క్వార్టర్స్ ఆసిఫాబాద్ నందు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కే .సురేష్ కుమార్ హాజరయ్యారు. మొదటగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ” “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్ని అవయవాలల్లో కళ్ళు ఎంతో ప్రధానమని, ఈ డిజిటల్ యుగంలో మానవులు కళ్ళ నాణ్యత కోల్పోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శమని ప్రజలు, పోలీస్ సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖలో ఎన్నిక కావడంలో కంటి పరీక్షలు తప్పనిసరి అయినా, కూడా విధి నిర్వహణలో ప్రమాదాలకు గురి అయ్యి కంటి సమస్యతో బాధపడుతున్న వారు పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డివిజన్ మరియు కాగజ్ నగర్ డివిజన్ నుండి 84 మంది సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర రావు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) భీమ్ రావు, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వినోద్ కుమార్, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్ , ఆప్తమెటిక్స్ వెంకటేష్ , సురేష్, వైద్య సిబ్బంది శృతి , శ్రీకాంత్, జిల్లా సీఐ లు, ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!