జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ కు జర్నలిస్టుల వినతిపత్రం,యూనియన్ డైరీ అందజేత
ఫిబ్రవరి.28.2023,
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మంగళవారం ఫిబ్రవరి(28) కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకు ఇటీవలే నూతనంగా వచ్చిన కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావుకి అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు నాయకులు అనేకమైన జర్నలిస్టుల తీరని సమస్యల పరిక్షరానికై విముక్తి చూపాలని కలెక్టర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు,యూనియన్ డైరీని ఘనంగా లాంఛనంగా ప్రారంభిస్తు కలెక్టర్ కు అందించారు.ఈ సందర్భంగా ఏబీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ మాట్లాడుతు.కొమురంభీం జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు.
కలెక్టర్ హేమంత్ బోర్కడేకి ఇచ్చిన వినతి పత్రంలో జర్నలిస్టుల సమస్యల పై పలు డిమాండ్లలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా ప్రముఖ పాత్ర వహించింది ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన మేనోపేస్టు లో పేర్కొన్న విధంగా,జర్నలిస్ట్ లందరికి బేషరత్తుగా అక్రిడియేషన్ కార్డ్స్ మరియు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు,ఇస్తామని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేస్తామని పేర్కొన్నారు.కాని నేడు జర్నలిస్ట్ లకు అవి అందని ద్రాక్ష గా మిగిలింది.అందుకే. సంస్థ ఐడి కార్డు కలిగి ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరికి.ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్స్,అక్రిడియేషన్ కార్డ్స్ మంజూరు చేయాలి.హెల్త్ కార్డు లు,బస్ పాస్ లు మంజూరు చేయాలి.జిల్లాల వారిగా జర్నలిస్ట్ లకు ఉచిత శిక్షణ ఇవ్వాలి.అర్హులైన దళిత జర్నలిస్ట్ లకు, దళిత బంధు వర్తిప చేయాలి.జర్నలిస్ట్ ల పిల్లల కు కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాల, కళాశాల లలో ఫీజులో 50% రాయితీ కల్పించాలని అన్నారు. జర్నలిస్ట్ లపై దాడులు కాకుండా ప్రభుత్వం వారికీ పూర్తి భద్రత కల్పించాలి.తెలంగాణ రాష్ట్ర సాధన లో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు. చిన్న పత్రిక పెద్ద పత్రిక, చిన్న, పెద్ద ఛానల్ అని చిన్న చూపు చూడకుండా సంస్థ ఐడి కార్డ్స్ కలిగిన వర్కింగ్ జర్నలిస్ట్ లందరికి పై సదుపాయాలు కల్పించాలని పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రంను కలెక్టర్కి అందజేశారు,యూనియన్ డైరీని లాంఛనంగా కలెక్టర్ కీ సమర్పించారు. అనంతరం. డీపీఆర్ ఓ.కృష్ణమూర్తిని.మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్ట్ ల సమస్యలు వివరించి వర్కింగ్ జర్నలిస్ట్ లకు అండగా ఉండాలని కోరడం జరిగింది. రోజురోజుకు జర్నలిస్టులపై,మీడియా సంస్థలపై దాడులు పెరుగుతున్నాయని ఇది భావ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మీడియా పై, జర్నలిస్ట్ లపై దాడులను నియంత్రించేందుకు చట్టాలు పటిష్టంగా చేపట్టాలి స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని జిల్లాలోని జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కొమురంభీం జిల్లాలోని ఏబిజేఎఫ్ జర్నలిస్టులు తమ ఆవేదన ను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏబిజేఎఫ్.జిల్లాఉపాధ్యక్షులు.కృష్ణపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శి,డోంగ్రీ రవీందర్,కోశాధికారి రాటే రవీందర్, సంయుక్త కార్యదర్శి తైదాల వెంకటేష్, చారి కార్తీక్,ఈసి మెంబెర్స్ కంటే ఏలీయా, డోంగ్రీ భారత్, డోంగ్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.