నంబర్ ప్లేట్ వాహనాలను సీజ్ చేస్తాం,సెల్ ఫోన్లు పెట్టుకుంటాం,డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం నేరం….ఇంతటి విలువైన మాటలు ప్రతి రోజు ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు ప్రజలకు చెబుతూనే ఉంటారు. అవి ప్రజలకు మాత్రమేనా లేక పోలీసులకు కూడ వర్తించునా అంటే ఆచరణలో మాత్రం మాకివేవి వర్తించవు అన్నట్టుగా వ్యవహారిస్తున్నారు కొంతమంది పోలీసులు. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది…. పనులు అన్నట్టుగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ నంబర్ ప్లేట్ లేని వాహనం నడపడమే ఒక నేరం అయితే, అలాంటి వాహనం పై వెళ్తూ ఫోన్ మాట్లాడటం మరో నేరం. ఈ విధంగా వెళ్తున్న మనోడేలే వెళ్ళనీ అంటూ నవ్వుకుంటున్న మరో ట్రాఫిక్ పోలీస్. వడ్డించే వాడు మనోడు అయితే ఆఖరి బంతిలో కూర్చున్న అన్నీ సమకూరుతాయి అన్నట్టుగా తప్పు చేసిన మనోడే ,ఒప్పు చేసిన మనోడేలే అనుకుని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై పట్టణ ప్రజలు, ద్విచక్ర వాహనదారులు నివ్వెర పోతున్నారు.