చికిత్స పొందుతూ కొలుకోలేక వ్యక్తి మృతి
మహానంది: సీఎం సంకల్పం న్యూస్, ఫిబ్రవరి 26,
పాత కక్షల కారణంగా ఇరువు వర్గాల దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన చెవుల శ్రీనివాసులు (45) ఇటీవల పాత కక్షలతో ఇరువు వర్గాల దాడిలో గాయపడగా ఇతనిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. అనంతరం అక్కడ చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కొరకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అని, అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శ్రీనివాసులు మృతి చెందాడు అని తెలిపారు.ఇతనికి భార్య సరస్వతి ముగ్గురు కుమార్తెలు,ఒక కుమారుడు సంతానం.మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.