మహానంది క్షేత్రంలో దాతకు జరిగిన అవమానం పై విచారణ
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 23, మహానంది:
మహానంది దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లింగోద్యోద్భవం రోజున నంద్యాలకు చెందిన లక్క బోయిన ప్రసాద్ దంపతులకు జరిగిన అవమానంపై విచారణ చేస్తున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి విలేకరులకు గురువారం తెలిపారు.సీసీ ఫుటేజ్ లను పరిశీలించి సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకుంటామన్నారు. మహానంది క్షేత్రంలో జరిగే నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మరియు క్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో తమ వంతు సహాయంగా ఉచితంగా ఎల్లవేళలా కూరగాయలు మరియు పలు సందర్భాల్లో అవసరమైన సమయంలో ఆలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు అందించే వారికి అవమానం జరగడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది కూడా ప్రసాద్ దంపతులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల చివరి రోజున అవమానం జరిగినట్లు తెలుస్తుంది. దాతల సహాయ సహకారాలతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంటున్న అధికారులకు పర్యవేక్షించాల్సిన బాధ్యత మరియు గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది చర్చ నియంశంగా మారింది. గతంలో ఓర్చకుడు మద్యం మత్తులో గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా హంగామా చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై ఎలాంటి చర్యలు నేటి వరకు తీసుకోలేదు. ఓ పోలీస్ అధికారి అండ దండలతో ఆరోజు సమస్య సద్దుమణిలా చేశారు. కానీ అదే వ్యక్తి గా భావిస్తున్న వారు నిత్య అన్నదాన కార్యక్రమానికి కూరగాయల వితరణ దాత విషయంలో ఓ అడుగు ముందుకేసి ఆలయ ప్రతిష్టను మంట కలిపినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విచారణ నిష్పక్షకంగా జరిగేనా లేక తూతూ మంత్రంగా సీసీ ఫుటేజీలో ఆలయంలోని గోడల మధ్య కనిపించడం లేదని అధికార ఒత్తిళ్లతో కొట్టిపారేస్తారా అనేది తేలాల్చి ఉంది.