స్పీడ్ బ్రేకర్లు లేక ప్రజలు,వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
ప్రాణ నష్టం జరగక ముందే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 23, మహానంది:
మహానంది మండల పరిధిలోని గాజులపల్లె- నంద్యాల జాతీయ రహదారి కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వాహనా దారులు కోరుతున్నారు.గురువారం మధ్యాహ్నాం గాజులపల్లె మెట్ట జాతీయ రహదారి కూడలి వద్ద ఆగి ఉన్న బస్సును అదే సమయంలో నంద్యాల వైపు వెళ్తున్న కారు బస్సు వెనుక నుంచి ప్రమాదవశాత్తు ఢీకొని స్వల్పంగా దెబ్బతింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.ఈ సందర్భంగా వాహనా దారులు, ప్రజలు, మాట్లాడుతూ ఈ రహదారి గుండా ప్రతినిత్యం వేల సంఖ్యలో వాహనా దారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అని, ప్రధాన కూడలి వద్ద స్పీడ్‌బ్రేకర్లు,లేకపోవడతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి ప్రతి నిత్యం రద్దీగా ఉంటుందని, దీంతో ట్రాఫిక్ అధికంగా ఉండి ఈ ప్రాంతంలో ఒక్కోసారి నడిచివెళ్ళేందుకు కూడా వీలుండదని,అందువల్ల ఈ రహదారి కూడలి వద్ద ప్రమాదాలు జరిగి, ప్రాణనష్టం జరగకముందే మండల అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు, వాహనా దారులు కోరుతున్నారు.