*నిర్మలా కుమారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సత్యానందరావు…_*
ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందిన వైసిపి మహిళ నేత కొల్లి నిర్మల కుమారి కుటుంబ సభ్యులను బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండల నాయకులతో కలిసి పరామర్శించారు. ముందుగా నిర్మల కుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ నిర్మల కుమారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట సలాది నాగేశ్వరరావు, వైట్ల శేషుబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కప్పల సునీల్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము నారాయడు, సిర్రా నాగరాజు, తేజ, లంక వినయ్, తదితరులు పాల్గొని ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు._