బహుజనులంటే KCR కు చిన్న చూపు, వివక్ష అని BSP మహబూబాబాద్ జిల్లా దార్ల శివరాజ్ ఆరోపించారు. BSP రాష్ట్ర యూనిట్ ఆదేశాల మేరకు కoటోన్మెంట్ అసెంబ్లీ సిట్టింగ్ MLA సాయన్న మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మరణించిగా రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించకుండా వివక్ష చూపింది KCR ప్రభుత్వం అని ఆయన అన్నారు.దీనికి నిరసనగా BSP అసెంబ్లీ యూనిట్ ఆధ్వర్యంలో జమాండ్ల పల్లి గ్రామo డా :అంబెడ్కర్ విగ్రహం ముందు ఫ్లకార్డు లు చేత బూని నిరసన తెలపడం జరిగింది. కారణం సాయన్న బహుజన సమాజం కు చెందిన వ్యక్తి కావడం వల్లనే అని ఆయన ఆరోపించారు.ఆంధ్ర సెటిలర్స్ అయిన సినీ పరిశ్రమ, అగ్ర కుల పెట్టుబడి దారులైన రాజకీయ నాయకులు చనిపోతే వారికి మాత్రం అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం అలాంటిది బహుజన వర్గానికి చెందిన ప్రముఖలను మాత్రం గతంలో తాటికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, చనిపోయిన తర్వాతే సాయన్న ను వివిధ రూపాల్లో అవమానం చేస్తుంది అని ఆయన అన్నారు. ఈ విషయం పై బీజేపీ స్పందించలేదు అని కారణం సాయన్న హిందూ కాపోవడం వల్లేనని ఆయన ఆరోపించారు. బహుజనులకు ఆత్మ ఇతర మనువాద పార్టీల్లో వివిధ రూపాల్లో అవమాన పడటం కంటే BSP లోకి వచ్చి ఆత్మగౌరవం తో బ్రతకాలనీ ఆయన పిలుపునిచ్చారు.. ఈ సందర్బంగా జోహార్ సాయన్న అంటూ నినాదాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి జింక లక్ష్మణ్,మహబూబాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు తోకల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఉబ్బపెల్లి శ్రావణ్, మండల ఉపాధ్యక్షులు బొడ్డుపెల్లి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి బానోత్ హచ్య, శ్రీకాంత్, కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.