అనకాపల్లి జిల్లా యస్.రాయవరం మండలం లింగరాజు పాలెం గ్రామ సచివాలయం పరిధిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ లో భాగంగా దీర్ఘకాలిక కాలిక వ్యాధిగ్రస్తులయిన బి.పి, సుగర్, ఫిట్స్ ,గుండె జబ్బులు థైరాయిడ్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధి, పక్షవాతం , టి.బి, హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులను, గర్భిణీ స్త్రీలు ను బాలింతలు ను, స్కూల్ విద్యార్థులను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్ .శక్తి ప్రియ తనిఖీ చేసి, రక్త పరీక్షలు నిర్వహించి తదుపరి సూచనలు, సలహాలు ఇచ్చి మందులు అందజేసినట్లు ఎం.పి.హెచ్.ఈ. ఒ… టి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి.రామ లక్ష్మి, క్లస్టర్ హెల్త్ అసిస్టెంట్ బి. ప్రేమ్ కుమర్,. సచివాలయం హెల్త్ సెక్రటరీ డి. బేబీ , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.