రైతుల పత్తికి మద్దతు ధర కేటాయించాలని కలెక్టర్ కీ ఆమ్ ఆద్మీ పార్టీ వినతిపత్రం
స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ ఫిబ్రవరి 22
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తేదీ 22-2-2023,బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పత్తికి మద్దత్తు ధర వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావుకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల డిమాండ్,చేస్తూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తికి కనీస మద్దతు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రారంభంలో 10,000 ఉన్న పత్తి ధర ఇప్పుడు గణనీయంగా తగ్గి 7,600 చేరుకుందని,ఇది బాధాకరమని రైతుల గుండెల్లో గునపం దింపడమేనని పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 8,300 ఉండగా, మన రాష్ట్రంలో కనీసం గిట్టు బాటు ధర లేక పోవడం వళ్ళ రైతులు పండించిన పత్తిని ఇంట్లోనే నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధర కోసం ఏదురు చుస్తునారనీ,తెలియజేశారు. ఇంకొందరు తక్కువ దరకు అమ్మి నష్ట పోయారు,ఇప్పటికైనా దయచేసి సంబంధిత అధికారులతో చర్చలు జరిపి,ఇక్కడ జరుగుతున్న రైతుల నష్టాన్ని ప్రభుత్వానికి తక్షణమే నివేదిక పంపి కనీస గిట్టు బాటు ధర 12,000 వచ్చేటట్టు కృషి చేయాలనీ కలెక్టర్ కి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు రాంటేంకి అజయ్ కుమార్,జావీద్ అలీ ఖాన్ విన్నవించారు.