పట్టపగలే గూడూరు లోని 2 ఇళ్లలో దొంగతనాలు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని లక్ష్మి నారాయణ స్వామి ఆలయ సమీపంలో ఏలగం కేదారి ఇంట్లో , శివాలయం సమీపం లోని గుడ్ల కట్టమల్లు ఇళ్లలో పట్టపగలే దొంగలు చొరబడి 2 ఇళ్ల లో కలిపి ముప్పై వేల రూపాయల నగదు 10 తులాల వెండి దొంగిలించినట్లు ఇంటి యజమానులు తెలిపారు వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం ఇళ్లకు తాళాలు వేసి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు గూడూరు ఎస్సై సతీష్ సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు పట్ట పగలే గూడూరులో దొంగలు బీభత్సం సృష్టించడం తో గూడూరు గ్రామ ప్రజలు భయాందోళకు గురవుతున్నారు ల్లో భయాందోళనలో ఎక్కువ అవుతున్నాయి ఒకప్పుడు దొంగలు రాత్రిపూట పడుతుంటే రోజులు మారుతున్న కొద్దీ పట్టపగలే దొంగతనం చేయడానికి దొంగలు ఏమాత్రం భయపడకుండా అడ్డు అదుపు లేకుండా బీభత్సం సృష్టిస్తున్నారు గ్రామస్తులు ఇంట్లో ఉండాలన్న బయటికి ఏ కార్యానికైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్న భయపడే స్థితికి రావడం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.