మహానంది క్షేత్రంలో పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 21, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మహా పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మహానంది క్షేత్రంలో దీక్షాహోమాలు, ధ్వజ ఆవరణహోమం, నిర్వహించారు.అనంతరం ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దంపతులచే వేదపండితులు వేద మంత్రాలతో ఉత్సవాల ముగింపు సందర్భంగా మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి రోజు స్థాపించిన కలశాలకు ఉద్వాసన పలికి ఆలయ ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లకు సమర్పించారు. అనంతరం రుద్రగుండం పుష్కరిణిలో త్రిశూల స్నానాలు, చండీశ్వరము, అస్త్ర దేవతలకు విశేష చూర్ణ్భాషేకాలు, కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ పూజల వల్ల స్వామి, అమ్మవార్లు నూతన ఉత్తేజంతో స్వామి వార్లు మరింత శక్తివంతులై భక్తులకు దర్శనమిస్తారని వేదపండితులు తెలిపారు.
కన్నుల పండుగగా తెప్పోత్సవం:-
మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల తెప్పోత్సవం భక్తులకు కన్నుల పండువగా నిర్వహించారు.మంగవారం సాయంత్రం ఆలయంలోని రుద్రగుండం పుష్కరిణిలో తెప్పను ప్రత్యేక పుష్పాలంకరణ చేసి స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చీ ఈ ఉత్సవ దాతలు అవ్వారు గౌరినాథ్ సరస్వతి దంపతులు, ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దంపతులచే వేదపండితులు వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్ల తెప్పోత్సవం పుష్కరిణిలో ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్యుడు కనమర్లపూడి మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు.