చికిత్స పొందుతూ కొలుకోలేక వృద్ధుడు మృతి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 21, మహానంది:
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన గురువయ్య (66) సోమవారం మహాశివరాత్రి సందర్భంగా మహానందికి వెళ్లి బస్సులో తిరిగి ప్రయాణమై వచ్చి బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో దొర్నిపాడు మండలం గుండుపాపలకు చెందిన ప్రసాద్ రెడ్డి ద్విచక్ర వాహనం మీద వస్తూ గురవయ్య ను ఢీ కొన్నాడు .ఈ ఘటనలో గురువయ్యకి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మెరుగైన చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఈ ఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.