జీవితం ఈసీజీ లాంటిది… కష్టాలు వస్తూ, పోతూ ఉంటాయి : వక్త సేవక్ కుమార్

జీవితం ఈసీజీ లాంటిది… కష్టాలు వస్తూ, పోతూ ఉంటాయి : వక్త సేవక్ కుమార్

వికారాబాద్, ఫిబ్రవరి19 ; జీవితం అనేది హాస్పిటల్ లో ఉంటే ఈసీజీ లాంటిదని,ఈసీజీ లో వచ్చే గీతలు కిందికి పైకి వెళ్తూ ఉంటేనే మనిషి బ్రతికి ఉన్నట్లు అని,ఆ గీతలు లైన్ గా వెళ్తే మనిషి మరణించాడని అర్థం అని,అలాగే జీవితంలో కష్టాలు సుఖాలు వస్తేనే జీవితం బాగుంటుందని లేకపోతే జీవితానికి అర్థం లేదని వక్త సేవక్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎల్లమ్మ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రజలకు జీవితం పై మొటివేషనల్ క్లాస్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వక్త సేవక్ కుమార్ పాల్గొని మాట్లాడారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరు లక్ష్యాలకు అనుగుణంగా శ్రమించాలని సూచించారు. యువతకు జీవితం పై క్లారిటీ లేకుండా పోతుందని,పేదవారికి పుట్టడం తప్పుకాదని,పేదవారిగా చావడం తప్పక ని తప్పే అని అన్నారు.పిల్లలకు జీవితం పై క్లారిటీ కావాలని, జీవితంలో వారు ఎం సాదించుకోవాలో వారికే వదిలి వేయాలని,తల్లిదండ్రులు బలవంతగా వారి లక్ష్యాలను రుద్దరాదన్నారు. జీవితంలో సక్సెస్ కాకపోవడానికి తల్లిదండ్రులే కారణమని,వారికి అవకాశాలు ఇవ్వాలని అన్నారు. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను తమ తల్లిదండ్రులు మహారాజులుగా చూసుకోవాలని, ఆ వయసులో పిల్లలు అడిగిన ప్రతి దానిని తల్లిదండ్రులు సమకూర్చలని అలా చూసుకోకపోతే 25 సంవత్సరాల తరువాత వారు సైకోగా మారే అవకాశం ఉందని తెలిపారు. 6 సంవత్సరాలు నుంచి 15 సంవత్సరాలు లోపు పిల్లలను యువ రాజులు గా పెంచాలని,ఈ సమయంలో పిల్లలకు క్రమశిక్షణలో పెట్టాలని అన్నారు. 16 సంవత్సరాల పై ఉన్న పిల్లలను ఫ్రెండ్స్ గా చూడాలని, తల్లిదండ్రులను పిల్లలు ఇతరులతో పోతున్నారంటే, తల్లిదండ్రుల ప్రేమ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సెల్ ఫోన్ రెండు వైపుల పదునుగా ఉన్న కత్తిలాంటిదని ఎలా వాడుకుంటే అలా ఉందని మంచి కోసం మాత్రమే సెల్ ఫోన్స్ వాడాలని అన్నారు. యువత మంచి దారిలో నడవాలని, భాద, కోపం పడటం ద్వారా అడ్రినల్ రిలీజ్ అయ్యి గుండె పోటు బీపీ,షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు నవ్వడమే మర్చిపోయారు. నవడం ద్వారా ఎంతో ఆరోగ్యం ఉంటుందని అన్నారు. రైతులు కష్టాలు వచ్చి చచ్చిపోతే పట్టించుకునే నాధుడు లేదు. ఎవరైనా ధనికులు, రియల్టర్లు చచ్చిపోతే అందరూ వెళ్తారని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!