బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్
అనిల్ నాయక్
బంజారాలు జాతి ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించాలని వాటిని మరిచిపోకుండా ముందు తరాలకు కానుకగా ఇవ్వాలని లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ రంజిత్ నాయక్, డిజిఓ గైనకాలజిస్ట్ బిందు పల్లవి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలం అధ్యక్షులు భానోత్ అనిల్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 284 జయంతిని ఘనంగా నిర్వహించారు లంబాడి జాతి ముద్దుబిడ్డలు వివిధ గ్రామాల సర్పంచులు విద్యార్థులు రాజకీయ నాయకులు గ్రామ ఉద్యోగుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి భోగ్ బండారో వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రంజిత్ నాయక్ బిందు పల్లవి అనిల్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా గుత్తి మండలం గుంతకల్లు పట్టణంలో గొల్లదొడ్డి శివారు రాంజీ నాయక్ తండాలో 1739 ఫిబ్రవరి 15న రామావత్ భీమానాయక్, ధరమనీ బాయ్ దంపతులకు జన్మించారని అన్నారు నలుగురు కుమారుల్లో మొదటి వాడైన సేవాలాల్ ఆరేళ్ల బాలుడిగా ఉన్నప్పుడే వారసత్వంగా వస్తున్న పశువులను పోషణను వృత్తిగా స్వీకరించారనీ లంబాడీలను తరతరాలుగా గుర్తు ఉండే విధంగా మేరామా తల్లిని ఎదిరించి తన సాధన కొరకై గిరిజనులకు ఆదర్శంగా నిలిచిన సేవలాల్ మహారాజ్ ని లంబాడీలు తమ ఆరాద్య దైవంగా కొలుస్తారనీ అన్నారు
సేవలాల్ మహారాజ్ చరిత్ర ఓ గొప్ప గిరిజన బిడ్డగా తరతరాలుగా నిలుస్తుందని అన్నారు 284 వ జయంతిని గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారుఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల ఉపాధ్యక్షులు దేవా నాయక్ హనుమంతు నాయక్ సర్పంచ్ గంగ బేతంపూడి సర్పంచ్ లలిత మద్రాస్ తండా సర్పంచ్ రాజేందర్ నాయక్ ఎంపీటీసీ భద్రం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ధర్మారావు గుగులోతు బాలునాయక్ శ్రీకాంత్ కిషన్ జామలతండ నాయకులు డాక్టర్ హనుమాలాల్ సంతోష్ నాయక్ లక్ష్మణ్ నాయక్ హేమానాయక్ పంతులు నాయక్ హుస్సేన్ నాయక్ అర్జున్ నాయక్ రాముల నాయక్ హరి నాయక్ గ్రామస్తులు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు