వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 18, మహానంది:
ప్రముఖశైవక్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం నాడు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు పాలకమండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో విశేష పూజల చేత వేద పండితుల వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు వేదోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లు నంది వాహన సేవతో ఆలయ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనార్థమై లక్షల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి రావడం జరిగింది. దర్శనార్థమై వచ్చిన వేలాది సంఖ్యలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగంగా శనివారం రోజు రాత్రి 10 గంటల నుండి క్షేత్రంలో లింగోద్భవ కాల మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం వేద మంత్రాలతో విశేషంగా నిర్వహిస్తారు. లింగోద్భకాలంలో సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక సేవా టికెట్లు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుండి లోక క్షేమ కోసం శ్రీ కామేశ్వరి దేవి, మహానందీశ్వరుల కళ్యాణము వైభవంగా ముక్కోటి దేవతలు ఆశీర్వాదంతో లక్షల సంఖ్యలో భక్తుల సమక్షంలో అత్యంత విశేషంగా జరుగును. క్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో మెడికల్ క్యాంపులు, నిత్యాన్నదాన ప్రసాద కౌంటర్లు, మజ్జిగ, త్రాగునీరు ఏర్పాట్లు దాతల సహాయంతో ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.