మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు- డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 16, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 120 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం మహానంది పోలీస్ స్టేషన్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పార్కింగ్ స్థలాన్ని ఆలయానికి సమీపంలోకి తీసుకువచ్చినందుకు ఎలాంటి పాసులు మంజూరు చేయడం లేదన్నారు. ఆలయానికి 200 మీటర్ల దూరంలో పెద్ద నంది విగ్రహం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశామని పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో పార్కింగ్ లో వాహనాల్లో భద్రంగా చూసుకోవడం జరుగుతుందన్నారు. భక్తులు పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేస్తూ సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాలలో నలుగురు సిఐలు 6 మంది ఎస్ఐలు 110 మంది పోలీస్ సిబ్బందితోపాటు డాగ్ స్క్వాడ్, మొబైల్ టీమ్స్ ద్వారా 24 గంటలు బందోబస్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. అత్యవసర సమయాలలో టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టూరిజం పోలీస్ కేంద్రం వద్ద కానీ సిబ్బంది కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. రద్దీ ఉన్న ప్రాంతాలలో బందోబస్తు పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఓంకార పుణ్యక్షేత్రంలో సీఐతోపాటు ఇద్దరు ఎస్ఐలు 48 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరుగుతున్నారు, నవనందుల క్షేత్రాలలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. భోగేశ్వరం క్షేత్రంలో ఇద్దరు ఎస్ఐలు 30 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల తాలూకా రూరల్ సిఐ రవీంద్ర, మహేష్ బాబు, మహానంది ఎస్సై సీసీ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.