*భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలి.*
— _ఆలమూరు మండల దళిత సంఘాలు డిమాండ్_…
*_భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎప్పుడో మనుస్మృతిని దగ్ధం చేశారని ఇప్పుడు ‘శిక్షాస్మృతి’ పేరుతో మనుస్మృతి ప్రాచీన రాజ్యాంగ గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించడం రాజ్యాంగ వ్యతిరేకమని శిక్మాస్మృతి గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న వారిపై ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ, రాజద్రోహం కేసులను నమోదు చెయ్యాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండల దళిత సంఘాలు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఇంచార్జ్ తాసిల్దార్ జెడి కిషోర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగం ద్వారా మనుషుల మధ్య సమానత్వము,ప్రతి పౌరుడికి రాజ్యాంగపు హక్కులు,మహిళకు,అణగారిన వర్గాల కులాలకు ప్రత్యేక హక్కులు కల్పించి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులలో మార్పు వస్తున్న సమయంలో కొంతమంది మనువాదులు,మతోన్మాదులు కలిసి కుల అహంకారముతో మనుస్మృతి ప్రాచీన రాజ్యాంగము శిక్షాస్మృతి అనే గ్రంధాన్ని ఆవిష్కరించి కులాలపై వివక్షత,ప్రాచీన అనాగరికతను తీసుకుని రావడం దీని ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు.అలాగే గ్రంథం ఆవిష్కరణ తొలి ప్రతినిధి హమారా ప్రసాద్ అనే దళిత ద్రోహికి ఇవ్వడం యావత్ దళిత జాతిని అవమానపరిచడమేనని తెలియజేసి రాజ్యాంగమును మార్పు చేయాలనుకునే మాడుగుల నాగఫణి శర్మను అలాగే అతని అనుచరులపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసి తక్షణమే తాసిల్దార్ వారు స్పందించి తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయమునకు వారి యొక్క వినతి పత్రం పంపించవలసిందిగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళిత బహుజన ఫ్రంట్ వేమగిరి నరసింహమూర్తి, ఆలమూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఆర్సి.నారాయణ రెడ్డి,టిడిపి యువ నాయకులు,రాష్ట్ర కార్యదర్శి,న్యాయవాది కే సునీల్ కుమార్, న్యాయవాదులు సరాకుల సత్యనారాయణ,ఎన్ రాజారావు,కే ధనరాజు, సిపిఐ కొండే రామకృష్ణ,లంకే యాకోబు తదితరులు పాల్గొన్నారు._*