విలేఖరికి 2023,కేవీపీఎస్ డైరీని అందించిన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ తేదీ 14/౦2/2023,మంగళవారం రోజున విలేఖరి కృష్ణపల్లిసురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి కేవీపీఎస్ 2023,డైరీ ఆత్మ గౌరవం సమానత్వం కుల నిర్మూలన గలా డైరీని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకోసం దేశం కోసం జీతభత్యాలు లేకున్నా కుటుంబ పోషణ కఠినంగా ఉన్న గానీ నిరంతరం అలుపెరుగని యోధుల్లా పోరాటం చేస్తూ అంతమవుతున్న చరిత్రలను నిజాలను అవినీతి భూకబ్జాలు అక్రమాలను వెలిక్కి తీసి తాను మాత్రం చీకటి యుగంలో సూర్యుడిలా ఉదయించే వారే జర్నలిస్టులని అన్నారు.దేశానికి మీడియా నే ప్రధాన మైన రెండు కనురెప్పలని ఆ రెప్పలను కంటి పాపలుగా కాపాడుకోవాలని సూచించారు.విలేఖరి కృష్ణపల్లిసురేష్ ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టి మధ్యతరగతి వ్యవసాయ కుటుంభంలో పుట్టి దేశ నలుమూలలా ఎన్నో అక్రమాలు అవినీతి లంచాలు భూ కబ్జాలను వెలుగులోకి తెస్తూ బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా దేశాభివృద్ధికి ఎంతోగానో కృషి చేస్తున్నా.విలేఖరి కృష్ణపల్లిసురేష్ సేవలు అభినందనీమని ఇలాంటి విలేకరులు గల్లీకి మండలానికి జిల్లాకు ప్రధానంగా ముక్యంగా దేశానికి అవసరమని హర్షం వ్యక్తం చేశారు.కేవీపీఎస్ డైరీ ఆశయాలు లక్ష్యాలు.అంటరానితనం.దళితుపై దాడులు, అత్యాచారాలు,హత్యలు అరికట్టేందుకు సామాజిక, ఆర్ధిక సమానత్వసాధన, కులవివక్ష నిర్మూలనకై 1998 అక్టోబర్ 2న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఏర్పడింది.ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనకై పోరాడుతుంది.దళిత, గిరిజన, బలహీనవర్గాలు తదితరులపై కొనసాగుతున్న అంటరానితనం,కుల వివక్ష నిర్మూలనకై పోరాడుతుంది. సామాజిక, ఆర్ధిక సమానత్వంకై పోరాడుతుంది. సమాజికోద్యమ నాయకుల ఆశలను కొనసాగిస్తోంది. దళిత, బడుగు, పీడిత వర్గాల ఐక్యతకై పనిచేస్తుంది. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తుంది. కులవివక్షను,కులవ్యవస్థను నిర్మూ లించాలనుకునే వారు ఏ కులంలో పుట్టిన వారైనా సంఘంలో పని చేయవచ్చును. ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సంఘం ఆశయాల సాధనకై కుల వివక్షను నిర్మూలించేందుకు కేవీపీఎస్ లో పనిచెయ్యవచ్చును.భిన్నాభిప్రాయాలు కలిగిన వారైనా, సామాజిక, ఆర్ధిక, న్యాయసాధనకు కలిసి పనిచెయ్యవచ్చును.ఈ యొక్క కేవీపీఎస్ దళితులందరికి ఉపాధి, ఉద్యోగం, సంక్షేమ పథకాలు అమలుకై, దళిత ఉద్యోగుల హక్కులు, సమస్యలపరిష్కారానికి కృషి చేస్తుందని. భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ జీవిత ముఖ్య ఘట్టాలు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత ముఖ్య ఘట్టాలు. సావిత్రి బాయి పూలే జీవిత ముఖ్య ఘట్టాలు.బాబు జగ్జీవన్ రాం జీవిత ముఖ్య ఘట్టాలు.సమాచార హక్కు చట్టం 2005.గుర్చి. రాజ్యాంగంలో దళితులకు అనుకూలించే అధికరణలు.షెడ్యూల్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి, షెడ్యూల్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం.ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సవరణ చట్టం 2015.జస్టిస్ పున్నయ్య సిఫార్సులు.దళితులకు స్మశాన స్థలాల కోసం ఇచ్చిన జి. ఒ.మరెన్నో ఇలాంటి ఇతరత్రా ముఖ్యమైన మానవాళి హక్కుల మేలుగోలుపు ఘట్టాలు డైరీలో భద్రంగా ముద్రించబడ్డాయని పేర్కొన్నారు. ఇలాంటి డైరీ అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని విలేఖరి సురేష్ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శికీ సానుకూలంగా కృతజ్ఞతలు తెలిపారు.