విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యా కేసు నమోదు చేయాలి.

విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యా కేసు నమోదు చేయాలి.

కార్పోరేటు విద్యాసంస్థలలో వరుస ఆత్మహత్యల పై న్యాయ విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ బి మంచిర్యాల జిల్లా ప్రధానాకార్యదర్శి అల్లి సాగర్ యాదవ్.

హైదరాబాద్ లోని కార్పోరేటు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి ఆత్మ హత్య కు కారుకులైన శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యాకేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా స్టుడెంట్ బ్లాక్ జిల్లా ప్రధానాకార్యదర్శి అల్లి సాగర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ మార్కులు, ర్యాంకుల కోసం శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం విధ్యార్థులను తీవ్ర ఓత్తిడి కి గురిచేస్తూ ఫలితాలే లక్ష్యంగా మానసిక వేదనకు గురిచేయడం బాదాకరం అని అన్నారు. కార్పోరేట్ కాళాశాలలో వారి లాభం కోసం తప్ప విద్యార్థి సంక్షేమం కోసం పట్టించుకోకుండ వ్యవహరిస్తున్నారని శ్రీ చైతన్య విద్యాసంస్థలో ఇది మొదటి ఆత్మహత్య కాదని, ఇలా ప్రతి సంవత్సరం ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైన ప్రభుత్వం స్పందించి శ్రీ చైతన్య యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేసేంతవరకు ఏఐఎస్ బి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం అని హెచ్చరించారు. ఈ ఘటనకు కారుకులైన వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేట్ విద్యాసంస్థలలో విద్యార్థులు మానసికా వేదనకు గురికాకుండా ఉండేందుకు ఆవగాహన సదస్సును నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐఎస్ బి నాయకులు మనోహర్,ప్రశాంత్,రాకేష్ తదితరులు పాల్గోన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!