రూ.5.89 లక్షల ఎరువుల అమ్మకాలు నిలిపివేత
ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 14, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని గఫారియా పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణంలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి బి.నాగేశ్వర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి బి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ తనిఖీలో కొన్ని రసాయన ఎరువులకు సంబంధించి సరైన అమ్మకపు రికార్డులు మరియు ఫారం ఓ అనుమతులు లేనందున 5 లక్షల 89 వేల 190 రూపాయలు విలువ చేసే 32.65 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగిందని, ఈ సందర్భంగా రైతులకు ఖచ్చితంగా బిల్లులు ఫారం ఎం లో ఇవ్వాలని అదేవిధంగా బిల్లులో రైతుల సంతకాలు తీసుకోవాలని డీలర్లను హెచ్చరించారు.ఎవరైనా రసాయనిక ఎరువులను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు అమ్మితే వారి పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అదేవిధంగా రైతులు ఎరువులు తీసుకున్నప్పుడు తప్పకుండా బిల్లులో సంతకము చేసి బిల్లులు తప్పకుండా తీసుకోవాలని, అధిక ధరలకు అమ్మితే మండల వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలని కోరారు.