బ్రహ్మనంధీశ్వర స్వామీ వారిని కళ్యాణం కొరకు ఆహ్వానించుటకై బయలుదేరిన మహానందీశ్వరుడు.
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 14, మహానంది:
ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణములో వేంచేసిన శ్రీ గంగా పార్వతీ సమేత బ్రహ్మనందీశ్వరస్వామి వారిని ఆహ్వానించుటకు బయలుదేరిన శ్రీ కామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వరులు.ఈ సందర్భంగా ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంగళవారం నాడు సాయంత్రం మహానంది పుణ్యక్షేత్రం నుండి కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వరుల మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవమునకు ఆహ్వానించుటకు బ్రహ్మగారు అయినా శ్రీ పార్వతి సహిత బ్రహ్మానందీ ఈశ్వర స్వామి వారి ఆలయం నకు బయలుదేరి వెళ్లి, వారికి ఆహ్వానం తెలిపి బ్రహ్మ నందీశ్వర స్వామి వారితో కలిసి పలు గ్రామాలలో ఉత్సవ సంబరాలు జరుపుకుంటూ 15వ తేదీ రాత్రి మహానందీశ్వర ఉత్సవమూర్తులు మహానంది క్షేత్రమునకు చేరుకుంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది ,గ్రామస్తులు పాల్గొన్నారు.