అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో, కలెక్టరేట్ వద్ద వేలాది మంది 3000 పైగా అంగనవాడి, వర్కర్లు ఆయాలు, మినీ వర్కర్లు ధర్నా, నిర్వహించారు, మధ్యాహ్నం వరకు అధికారుల స్పందించకపోవడంతో, రోడ్డు మీదకు వచ్చి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ మెయిన్ గేటు నుండి పోలీసుల వలయాన్ని సేదించి లోనికి చొచ్చుకొని, కోనిపోయారు. కలెక్టర్ ఛాంబర్ తలుపులు మూసి వేసుకున్నారు. మరో బ్యాచ్ వెనుక ప్రాంతంలో నుంచి కూడా పోయి బైఠాయించారు. మొదట ధర్నానుదేశించి, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ శ్రీలక్ష్మి అధ్యక్షత వహించారు. యూనియన్ గౌరవాధ్యక్షులు, పి. శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామంజులు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి పి.రాజేశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్ డి. భాగ్యమ్మలు , జిల్లా కోశాధికారి బంగారు పాప,ప్రసంగించారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందర తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని మాట చెప్పారని, మూడున్నర సంవత్సరం అయినా అమలు చేయలేదన్నారు. తక్షణం పేస్ అటెండెన్స్ యాప్ ను రద్దు చేయాలన్నారు. 2017 నుండి ఐదు సంవత్సరాలు టిఎ, డి ఏ చెల్లించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలన్నారు. అర్హత కలిగిన ఆయాలకు వర్కర్లుగా, ప్రమోషన్ ఇవ్వాలన్నారు, మినీ అంగన్వాడీలను సెంటర్లో మెయిన్ సెంటర్ గా మార్చాలి అన్నారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్ 50 వేల నుండి ఐదు లక్షలకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంత వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. మెనూ చార్జీలు పెంచాలని, నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని, అంగన్వాడి సెంటర్లు కుదించడం మానుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పి ఆలోచన విరమించుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ కు నిధులు బడ్జెట్లో నిధులు పెంచాలన్నారు. అధికారులు రాజకీయ నాయకుల వేధింపులు అరికట్టాలన్నారు. నిర్బంధాల ఒకటి జీవో రద్దు చేయాలన్నారు. ఫుడ్ కమిషనర్ అంగన్వాడీలను దొంగలుగా చిత్రీకరిస్తూ ఫేస్బుక్ లో, యూట్యూబ్లో, ఆత్మగౌరవని దెబ్బతీస్తున్నారని, కమిషనర్ గో బ్యాక్ అనే నినాదించారు. గౌరవ వేతన మాకొద్దు కనీస వేతనం కావాలి, మాట తప్పిన సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ బయటకు రావాలని, చర్చలకు పిలవాలని, సిఐటియు జిందాబాద్ నినాదాలతో కలెక్టరేట్ వద్ద దద్దరిల్లింది. అనంతరం యూనియన్ నాయకులను కలెక్టర్ చర్చిలకు ఆహ్వానించారు. సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. అర్హత కలిగిన ఆయాలకుప్రమోషన్, ఇవ్వాలని, స్థానిక సమస్యలు పరిష్కారానికి అధికారులు యూనియన్ నాయకులతో, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, అందుకు అంగీకరించారు, మిగతా విషయాలు ప్రభుత్వాన్ని తెలియజేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు కార్యదర్శులు, ఎం జయరామయ్య, పంది కాళ్ళ మణి, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, కో కన్వీనర్, డీసీ వెంకటయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి, రామచంద్ర, ఉపాధ్యక్షులు నాగ బసిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు గోట్టిగల్ ప్రాజెక్టుల నుండి హాజరైనారు. అన్ని ప్రాజెక్టుల అధ్యక్ష కార్యదర్శులు ప్రసంగించారు. రమాదేవి, సుజాత, పద్మ, వనజ, విజయ, ఈశ్వరమ్మ, చంద్రకళ, సుజాత, నాగరాణి ,ఖాజాబీ, ఓబులమ్మ, లక్ష్మీదేవి, ప్రభావతి, గౌరీ, మధురవాణి, పద్మశ్రీ, శ్రీ వాణి, కరుణ శ్రీ, భూకైలాసి, మీనాక్షి, , సిఐటియు పెనగలూరు కార్యదర్శి మద్దెల ప్రసాద్, ఓబులవారిపల్లి కార్యదర్శి కె.వి రమణ, సిఐటియు రాయచోటి నాయకులు ఎస్ .ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.