కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన భాషా పండితులు
వికారాబాద్
వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో భాష పండితులకు ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భాషా పండితులు నిరసన వ్యక్తం చేశారు. వారి నినాదాలు విన్న జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి సమస్యలను పై స్థాయికి చేరవేస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక జిల్లా విద్యాధికారి రేణుకా దేవి కూడా వీలైనంత తొందరగా భాషా పండితుల సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పండితా ఐక్యవేదిక సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, ఎజాస్ అహ్మద్, రఘునాథ్, శ్రీనివాస్ రెడ్డి కృష్ణయ్య, రామకృష్ణ ,రాజశేఖర్ నరసింహులు, గంగయ్య, మల్లేశం పంతులు అహ్మద్ గోపాల్, భీమయ్య, నవీన్ ముక్తార్ అహ్మద్ ఉమర్ఖాన్ , రెద్యా రాథోడ్, ప్రభావతి, రతన్ ,ప్రభుచారి ,ఆశాలత, శ్రీనివాస్ షారుక్, రాజేందర్ ,తదితరులు పాల్గొన్నారు.