సిసి రోడ్డుకు ఇరువైపులా మొరం వేయించిన చైర్మన్
👆మునిసిపాలిటీ నుండి బ్రహ్మోత్సవాలకు తగు చర్యలు తీసుకుంటున్నాం-చైర్మన్
అయిజ:జోగుళ్లాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో పాత బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నిర్మించిన సిసి రోడ్డుకు ఇరువైపులా మొరం వేయుటను మునిసిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న. పరిశీలించారు.ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ జనవరి నెల 30 తేదీ నాడు జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు అందరూ కౌన్సిలర్లతో చర్చించి మునిసిపాలిటీ నుండి 2:00 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. అందులో భాగంగానే నేడు పాత బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు సిసి రోడ్డుకు ఇరువైపులా లెవల్ కోసం మొరం వేయించడం జరుగుతుందని తెలిపారు.సిసి రోడ్డుకు పక్కల వేసిన మొరంను డోజర్ తో చదును చేయాలని సిబ్బందిని ఆదేశించారు.జాతర జరుగు తిక్క వీరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గుంతలకు కూడా మొరం వేసి చదును చేస్తామని తెలిపారు.చైర్మన్ గారి వెంట BRS నాయకులు శ్రీ నేసే వెంకటేష్ గారు,మునిసిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.