హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు
టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సమ్మక్క – సారలమ్మ గద్దెలకు పూజలు చేసి ప్రారంభించిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో మాజీ మంత్రి టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చేర్మెన్ చిన్నారెడ్డి గారు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి తో కలిసి టీపీసీసీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని, ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు పొడిగింపుగా రేవంత్ ‘‘హాత్ సే హాత్ జోడో’’ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ తీసుకువెళ్తామని తెలిపారు. 2003లో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసి అధికారంలో వచ్చిందని, 2023లో చేస్తున్న పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వారు ధీమా వ్యక్తం చేశారు.