వాణీ జయరాం మృతిపై అనుమానాలకు తెర.. ఆ గాయాలకు కారణం ఇదే..!

వాణీ జయరాం మృతిపై అనుమానాలకు తెర.. ఆ గాయాలకు కారణం ఇదే..!

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఆమె మృతిపై ఎలాంటి సందేహాలు లేవని చెన్నై పోలీసులు స్పష్టం చేశారు. బెడ్రూంలో ఆమె కింద పడటంతో తలకు బలమైన గాయం తగలడం వల్లే ప్రాణం పోయిందని ఫోరెన్సిక్‌ నిపుణులు నివేదిక ఇచ్చారని పోలీసులు తెలిపారు. వాణీ జయరాం నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు.


తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. ఆమె అంతిమ యాత్రలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెన్నై బీసెంట్‌ నగరులో ఉన్న విద్యుత్‌ దహన వాటికలో ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతకుమందు ఆమె పార్థివదేహానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!