క్షేత్రంలో పర్యవేక్షణ లోపం..
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 05, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో అధికారుల పర్యవేక్షణ లోపం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆదివారం నాడు ఆలయం లో కూత వేటు దూరంలో ఉన్న టీటీడీ గదుల సముదాయం ముందు భాగంలో చిన్న లారీలు వచ్చిన యాత్రికులు మాంసం వండుతున్న చూడలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అటుగా వెళుతున్న భక్తులు వెళ్తున్న క్షేత్ర పరిసరాల్లో మాంసాహారాలు వండడం ఏంటి అని ముక్కున వేలేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భక్తులు ఆలయ అధికారులకు ఆలయానికి వచ్చే భక్తుల దర్శన టికెట్లు , భక్తుల నుండి వచ్చేఆదాయం తప్ప భక్తుల మనోభావాలు కాపాడే పనులలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అని విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆలయ అధికారులు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తుల సౌకర్యార్థమైంది తగు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను భక్తులు కోరుతున్నారు.