మహానంది క్షేత్రంలో పాత మాడ వీధిలో కారు హల్చల్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఫిబ్రవరి 05, మహానంది:
మహానంది క్షేత్రంలోని పాత మాడవీధుల్లో ఒక కారు ఆదివారం హల్చల్ చేసింది.దక్షిణ ద్వారానికి ఎదురుగా ప్రసాదాల విక్రయాల కౌంటర్ ముందు భాగాన ఉన్న పాత మాడవీధుల గుండా ఎర్ర రంగు కారు లో కొందరు ప్రయాణించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎవరైనా ఈ మార్గంలో దర్శనానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ ఏకంగా భక్తుల మధ్య హారన్ మ్రోగించుకుంటూ వెళ్లడం ప్రాధాన్యసంధించుకుంది. సాధారణంగా ఆలయానికి ఏవైనా అవసరమైన వస్తువులు తరలించడానికి మాత్రమే ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. దీనిపై పలువురు పలు విధాలుగా చర్చించుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మాడవీధులు ఏర్పాటు చేయకముందు పాత మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా నిర్వహించేవారు. ఎంతటి వీఐపీలు వచ్చినా పాత మాడవీధుల యందు అనుమతించరు.ఆలయ అధికారి వివరణ :- మహానంది దేవస్థానంలో పాత మాడవీధుల గుండా కారు హాల్ చల్ అనే వార్తకు సంబంధించి ఆలయ అధికారి ఒకరు దీనిపై వివరణ ఇచ్చారు. ఆలయానికి సంబంధించి వాటర్ బాటిల్ లను తరలించామని తెలిపారు. ఇతర ప్రయోజనాల కోసం కారును వాడలేదన్నారు.