తిమ్మాయగారిపల్లి  సచివాలయ నిర్మాణాన్ని కాలయాపన చేస్తున్న అధికారులు తక్షణం పనులు ప్రారంభించాలి సిపిఎం డిమాండ్

తిమ్మాయగారిపల్లి  సచివాలయ నిర్మాణాన్ని కాలయాపన చేస్తున్న అధికారులు తక్షణం పనులు ప్రారంభించాలి సిపిఎం డిమాండ్

అన్నమయ్య జిల్లా   చిట్వేల్ మండలం, తిమ్మయ్య గారి పల్లి హెడ్ క్వార్టర్ లో సచివాలయం నిర్మించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన , ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా భావించిన, సచివాలయ నిర్మాణాన్ని , మూడున్నర సంవత్సరం అయినా, పనులు  ప్రారంభించలేదని, సిపిఎం పార్టీ  జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్.  పంది కాళ్ల మణి  శనివారం, విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు.   చిల్లావాండ్లపల్లి, అగ్రవర్ణాలకు అమ్ముడుపోయిన అధికారులు, హైకోర్టు తీర్పుకు భిన్నంగా తప్పుడు రిపోర్టులు ఇచ్చిన కారణంగా, ఎండిఓ , ఎంఈఓ , పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయిన విషయం గుర్తు చేశారు.  రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు, తిమ్మాయిగారపల్లి  హెడ్ కోటర్ దళితవాడలో భూమి పూజ  నవంబర్ 11వ తేదీన 2021లో,  చేసి గుణాదులకే పరిమితమైందన్నారు.  అధికార పార్టీ అగ్రవర్ణాల ఒత్తిడి కి తల ఓ గే,  కాలయాపన చేస్తున్నారన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో, వైసీపీ ప్రభుత్వం లో దళితులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు.   చిల్లా వాళ్ళ పల్లిలో,  ప్రభుత్వ భూమి లేదన్నారు, అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి, ఉన్నతాధికారులను మోసం చేశారన్నారు. కలెక్టర్ ఒత్తిడి మేరకు, తిమ్మాయగారి పల్లెలో హాస్పిటల్ కడుతున్నట్లు ఫోటోలు తీసి మాత్రమే అధికారులు పెట్టారన్నారు. ఇది దళితులను  ఉన్నతాధికారులను మోసం చేయడమే అన్నారు. సిపిఎం పోరాట ఫలితంగానే, అవినీతి తప్పుడు అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. కేసులు కూడా నమోదు అయ్యాయని, పోలీసులు మాత్రం అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తిమ్మాయగారిపల్లి హెడ్ క్వార్టర్ 153 ఏ సర్వే నంబర్లు హై కోర్ట్ ఆదేశాలనుతక్షణమే,సచివాలయ పనులు ప్రారంభించకపోతే, గ్రామ ప్రజలు దళితులతో నిరాహార దీక్షలు, ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసరి జయచంద్ర పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!