భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం సేవాలాల్ సేన టేకులపల్లి మండల అధ్యక్షులు బానోత్ నాగరాజు నాయక్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఫిబ్రవరి 6 తేది నాడు సోమవారం ఉదయం 10:00 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరాహార దీక్షను జయప్రదం చేయాలని అన్నారు సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్ ఆదేశానుసారం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు నిరాహార దీక్ష ఉంటుందని అన్నారు ఫిబ్రవరి 15వ తేదీ నాడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ ఏరియాలోని జీవో నెం 3 ద్వారా 100% రిజర్వేషన్లను అమలు జరపాలి రాజ్యాంగ పరమైన గిరిజన సమస్యలు హక్కులు పరిష్కరించుకొనుటకు ఎస్టి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన బంధు వెంటనే అమలు చేయాలని ఆటవిహక్కుల చట్టం ప్రకారం సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు సేవాలాల్ సేన జిల్లా నాయకులు మండల నాయకులు అనుబంధ కమిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఒక రోజు నిరాహార దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన టేకులపల్లి మండల అధ్యక్షులు బానోత్ నాగరాజు నాయక్ జిల్లా నాయకులు తేజావత్ రవి నాయక్ సోమ్లా నాయక్ ధరావత్ అశోక్ నాయక్ భూక్య సంజీవ్ నాయక్ మనోహర్ నాయక్ అరవింద్ నాయక్ రమేష్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు