మహానంది క్షేత్రంలో ఏపీ టూరిజం పోలీస్ కేంద్రం ఏర్పాటు
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 29, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో ఏపీ టూరిజం పోలీస్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నంద్యాల డిఎస్పి మహేశ్వరరెడ్డి ఆదివారం తెలిపారు. మహానంది ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, నంద్యాల తాలూకా రూరల్ సిఐ జి. రవీంద్ర, ఎస్సై సీసీ నాగార్జునరెడ్డితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహానందిలోని సమాచార కేంద్రం వద్ద ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని,భక్తుల సౌకర్యం కోసం నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహానంది ఆలయ ఏఈఓ ఎర్రమల మధు, మహానంది పోలీస్ సిబ్బంది శేషు, తదితరులు పాల్గొన్నారు.