యువ గళంతో సైకో పాలన అంతం-టీడీపీ శ్రేణులు
స్టూడియో 10 టీవీ న్యూస్ జనవరి 27, మహానంది:
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రతో రాష్ట్రంలో సైకో పాలన అంతానికి నాంది పలకడం జరిగిందని మహానంది మండల టిడిపి నాయకులు శుక్రవారం పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కుప్పంలో చేపట్టిన యువ గళం పాదయాత్రకు సంఘీభావంగా మహానంది మండల టిడిపి నాయకులు మహానందిలోని గరుడ నందికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఎన్టీఆర్ విగ్రహం నుంచి అయ్యన్న అరుగు వరకు పాదయాత్రగా వెళ్లి ఆ గ్రామంలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఓటు వేసి మాకు ఈ కర్మ పట్టిందని వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని జై తెలుగుదేశం అంటూ పాదయాత్రలో నినాదించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన అంతం కావడానికి యువగలం పాదయాత్ర మొదటి అడుగు వేసిందని త్వరలో జరిగే ఎన్నికలలో సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పాలనపై ప్రజలలో నిరాశ , నిశ్రుహత, పెరిగిందని ప్రతి ఇంటి వద్ద ఇదేమి ఖర్మ కార్యక్రమంలో ప్రజలు తమ కష్టాలను చెప్పుకొని వాపోతున్నారని ఓటు వేసినందుకు మాకు ఈ కర్మ పట్టిందని ప్రతి గడప వద్ద వినిపిస్తున్నట్లు తెలిపారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని 2024 జరిగే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావాలని గరుడనంధీశ్వరుని ప్రార్థించామని తెలిపారు. అల్లినగరం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ నగరంలో ఇదేమి కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఉల్లి మధు, మండల యూనిట్ ఇంచార్జీలు చంద్రమౌలేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కాకర్ల శివ, మండల టిడిపి నాయకులు గడ్డం నాగ పుల్లయ్య, కంచర్ల శివ, శ్రీనివాసులు, నాగరాజు మా రెడ్డి సుబ్రహ్మణ్యం బాబు, అబ్దుల్లా, మౌలాలి, కిట్టు పలువురు పాల్గొన్నారు.