జగనన్న విద్యా భారతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ*.

*జగనన్న విద్యా భారతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ*.

ఆలమూరు మండలంలో డాక్టర్ బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాల నందు ఈరోజు జగనన్న విద్యా భారతి స్టడీ మెటీరియల్ ను మండల పరిషత్ అధ్యక్షులు తోరాటి లక్ష్మణ్ రావు గారు, మరియు జడ్పిటిసి శ్రీమతి తోరాటి సీతామహాలక్ష్మి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, గ్రామ సర్పంచ్ శ్రీమతి నాతి లావణ్య కుమార్ రాజా, ఉప సర్పంచ్ శ్రీమతి చల్ల సీతామహాలక్ష్మి భూషణం, వైస్ ఎంపీపీ శ్రీమతి వాసంశెట్టి దుర్గాభవాని సాయిబాబా, ఎంపీటీసీలు ఉండమట్ల విజయ కుమారి, గంగుల నాగజ్యోతి, వార్డు మెంబర్లు రామానుజుల శేషగిరి గారు, వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ రావాడ సత్తిబాబు, చైర్మన్ ఎరుకొండ దుర్గ గణేష్, గార్లు పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యా భారతి స్టడీ మెటీరియల్ అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి శ్రీ మురళి సత్యనారాయణ గారు మాట్లాడుతూ విద్యార్థులు మెటీరియల్ సద్వినియోగం చేసుకుని పదవ తరగతిలో మంచి ఫలితాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పి వెంకటలక్ష్మి గారు మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!