*పాకాల మహిళా జూనియర్ కాలేజ్ నందు జాతీయ బాలికల దినోత్సవం అవగాహన సదస్సు*
పాకాల
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల మహిళా జూనియర్ కాలేజీ నందు జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమం జరిగింది ఇందులో పాల్గొన్న కళాశాల ప్రధానోపాధ్యాయులు సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ జాతీయ బాలికల దినోత్సవం
ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది తెలిపారు అదే విధంగా
ఆడపిల్లల కోసం దిశా పేరుతో ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దిశా యాప్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని స్కూళ్లలో గాని ఇంటి వద్ద గాని మరి ఎక్కడైనా ఆడపిల్లలకి ఇబ్బంది కలిగే విధంగా ఏవైనా కార్యక్రమాలు జరుగుతుంటే వెంటనే దిశా యాప్ ద్వారా గాని సచివాలయం మహిళ మహిళా పోలీసుల ద్వారా గాని వెంటనే సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా జూనియర్ కాలేజ్ ప్రధానోపాధ్యాయులు లెక్చలర్లు సీఐ రాజశేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు