ఆ ఫారెస్ట్ అధికారి రూటే.. సప..రేటు.
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 16, మహానంది:
ఆ ఫారెస్ట్ అధికారి రూటే… సప..రేటు . ఏంటి మీరు మా బీట్లో (గడిగుండం) ఆవులు, బర్రెలు, గేదెలు, గొర్రెలు మేపుతున్నారు. అయినా సంక్రాంతి పర్వదిన సందర్భంగా గొర్రెల కాపరులు మాకు రెండు లేదా మూడు పొట్టేలను కానీ గొర్రెలను కానీ ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మీరు మహానందిలో జరిగే పారువేట ఉత్సవాల్లో భాగంగా అక్కడ అటవీ శాఖకు ఒక గొర్రెను ఇస్తున్నారు. మరి మాకు ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏమిటి ఇలా అయితే కుదరదు కచ్చితంగా ఇవ్వాల్సిందే అని తేల్చి చెబుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా మహానంది దేవస్థానం వారు ఆచార వ్యవహారాల ప్రకారం గొర్రెల కాపర్ల నుండి అటవీ శాఖ సేకరించిన గొర్రెను పార్వేట ఉత్సవానికి ఉపయోగిస్తున్నారు. పారువేట అనంతరం ఆ గొర్రె మాంసాన్ని ఆయకట్లు వినియోగించుకుంటారు. అయితే నాకేంటి అనే విధంగా మా వాటా మాకు ఇవ్వాల్సిందేనని లేదంటే మీ ఇష్టం… మా ఇష్టం కాదు.. తర్వాత మీరే బాధపడతారు. అని తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విమర్శలు వెలివెత్తుతున్నాయి. అధికారి బీట్ పరిధిలో ఉన్న గ్రామాల్లో వారి వారి ఆచారాల ప్రకారం ఫార్మేట్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. సొంత పనుల కోసం పార్వేట ఉత్సవాలను అడ్డుపెట్టుకుని వేధిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో చాకలమర్రి అడవి ప్రాంత పరిధిలో పనిచేసిన కాలంలో కూడా అధికారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. అటవీ సమీప ప్రాంతంలో జీవాలు మేపుతున్నారని అందులో కొన్నింటిని స్వాధీనం చేసుకుని స్వ ప్రయోజనాల కోసం వినియోగించినట్లు ఆరోపణలు చోటు చేసుకున్న గతంలో పనిచేసిన కొందరు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో శాఖ పరమైన చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. దైవ కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతూ సొంత ప్రయోజనాలే ముఖ్యమైన రీతిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారులు తొక్కుతున్నట్లు పలువురు నుండి విమర్శలు వినవస్తున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో వారి బంధువులకు సహాయ సహకారాలు అందించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కొందరు అధికారుల సహాయ సహకారాలతో అధికారి బయటపడినట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి